Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యాడకు రహదారి కష్టాలు

Follow Udayam on Google
B Ganga Sep 05, 2026 5:10 PM పార్వతీపురం మన్యంGeneral
గుమ్మలక్ష్మీపురం (M) బయ్యాడకి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. 300 మంది జనాభా ఉన్న గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంకర రోడ్డుపై రాళ్లు తేలిపోవడంతో వర్షాలు కురిసిన ప్రతిసారీ ప్రయాణం కష్టంగా మారుతోంది. అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...