వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లాలోని బ్యాండ్ కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయాలని తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
జిల్లాలోని బ్యాండ్ కళాకారులను గుర్తించి కార్డులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు కళాకారులకు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

