Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇప్పలపల్లికి జిల్లా కేంద్రానికి బస్సులు కావాలి

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 4:17 PM జయ శంకర్ భూపాలపల్లి General
ఇప్పలపల్లికి జిల్లా కేంద్రానికి బస్సులు కావాలి - Udayam
మొగుళ్లపల్లి మండలం ఇప్పలపల్లి నుంచి జిల్లా కేంద్రానికి ఉదయం, సాయంత్రం బస్సు సౌకర్యం కల్పించాలని ధర్మ సమాజ్‌ పార్టీ జిల్లా నాయకుడు, ఆరో వార్డు సభ్యుడు దూడపాక శ్రీకృష్ణ కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో వినతిపత్రం ఇచ్చారు. బస్సు సౌకర్యం లేక ప్రజలు, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి బస్సులు నడపాలని కోరారు.

Comments

G
Loading comments...