Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీని ఢీకొన్న బస్సు.. 15 మందికి గాయాలు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 08, 2026 12:43 PM మార్కాపురంGeneral
లారీని ఢీకొన్న బస్సు.. 15 మందికి గాయాలు - Udayam
పొదిలి మండలం కాటూరివారిపాలెం సమీపంలో శనివారం ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సుమారు 15 మంది గాయపడ్డారు. లారీ డ్రైవర్‌ చక్రాల కింద ఇరుక్కుపోగా పోలీసులు, స్థానికులు శ్రమించి బయటకు తీశారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో పొదిలి సామాజిక వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ ఎం.రాజేష్‌కుమార్‌, ఎస్సై ఎస్.రాజేష్‌ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...