వార్తలకు తిరిగి వెళ్లండి

75 చదరపు గజాల్లోపు స్థలంలో 7 మీటర్లకు మించి నిర్మించిన భవనాలను గుర్తించి తొలగించాలని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 75 గజాలు దాటిన ఇళ్లకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సృజన స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

