వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభంతో కుషాయిగూడ, చక్రిపురం, నాగారం, రాంపల్లి ప్రాంతాల్లో పూల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. రహదారుల వెంట చిరు వ్యాపారులు బంతి, చామంతి, గులాబీ పూలను విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం బంతి, చామంతి పూలు కిలో రూ.100 చొప్పున అమ్ముతున్నట్లు వ్యాపారులు తెలిపారు. కరెంటు కోతలు, ఎల్‌నినో ప్రభావంతో పూల సాగు తగ్గి ధరలు పెరిగాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

