Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతుకమ్మ ఘాట్‌కు 3 ఎకరాల భూమి కేటాయించాలని వినతి

Follow Udayam on Google
Harika Nov 09, 2026 2:25 PM రాజన్న సిరిసిల్లGeneral
బతుకమ్మ ఘాట్‌కు 3 ఎకరాల భూమి కేటాయించాలని వినతి - Udayam
వీర్నపల్లి మండలం అడవిపదిర పరిధిలోని కట్టచింతల కాడ వద్ద ఉన్న సుమారు 3 ఎకరాల ప్రభుత్వ చెరువు శిఖం భూమిని బతుకమ్మ ఘాట్‌కు కేటాయించాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామస్థులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. స్పష్టమైన హద్దులు లేక భూమి ఆక్రమణకు గురవుతోందని, నీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. వెంటనే సర్వే నిర్వహించి భూమిని కేటాయించాలని కోరారు.

Comments

G
Loading comments...