Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్టాప్ లో ఆపని బస్సు.. మహిళకు తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Saychi Kumar Sep 23, 2026 3:21 PM కామరెడ్డితెలంగాణ
బస్టాప్ లో ఆపని బస్సు.. మహిళకు తీవ్ర గాయాలు - Udayam
కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బస్టాప్ వద్ద బస్సు ఆపకుండా బ్యాంకు వద్ద బస్సును నిలపడంతో బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ జారి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమె తలకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని డిపో మేనేజర్, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...