వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిగూడెంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఓ ప్రమాదం జరిగింది. తణుకు నుంచి తిరిగి వచ్చిన పాతూరు నివాసి మర్రిపూడి సుబ్బులు బస్సు వెనుక భాగం నుంచి దిగుతుండగా, డ్రైవర్ గమనించకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో చక్రం ఆమె కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద బాధితురాలిని వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్సై వెంకటరమణ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Loading comments...

