వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామానికి చెందిన నల్లగట్ల కిషోర్ తన ఊరికి బస్సు కావాలని గతంలో మంత్రి పొంగులేటిని కోరగా బస్సు సౌకర్యం కల్పించారు. తాజాగా స్మార్ట్ కార్డుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే రాగమయిని కిషోర్ కలిశారు.
గ్రామంలో డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, తాను చదువుతున్న పాఠశాలకు బల్లలు, కంప్యూటర్ సదుపాయాలు కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే బాలుడిని అభినందించి సానుకూలంగా స్పందించారు.
Comments
Loading comments...

