బ్రూక్ విధ్వంసం.. వేగవంతమైన అర్ధశతకం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి, ఆస్ట్రేలియాపై వేగవంతమైన టీ20 హాఫ్ సెంచరీ సాధించిన ఇంగ్లండ్ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.
బ్రూక్ 28 బంతుల్లో 65 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. గతంలో ఈ రికార్డు 22 బంతుల్లో అర్ధశతకం చేసిన జోస్ బట్లర్ పేరిట ఉండేది.
Comments
Loading comments...
