Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు పనుల కోసం BRS ధర్నా

Follow Udayam on Google
Harika Aug 26, 2026 3:14 PM వనపర్తిGeneral
రోడ్డు పనుల కోసం BRS ధర్నా - Udayam
ఘనపూర్ మండలం ఉప్పరిపల్లి నుంచి మంగంపల్లి వరకు రూ.253 లక్షల అంచనా వ్యయంతో చేపట్టాల్సిన రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో శిలాఫలకాల వద్ద ధర్నా నిర్వహించారు. శంకుస్థాపన చేసి ఏడాదిన్నర గడిచినా పనులు ప్రారంభం కాలేదని మాజీ ఎంపీపీ కృష్ణ నాయక్‌ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పనులు ప్రారంభించకుండా వదిలేస్తున్నారని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...