Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Follow Udayam on Google
raju Aug 26, 2026 4:09 PM నిజామాబాద్General
మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి - Udayam
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్‌లో నిర్వహించిన మిలాద్ ఉన్ నబీ కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. జీవన్ రెడ్డి ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త మహమ్మద్ బోధించిన శాంతి, సోదరభావం, ఐక్యత వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఆకాంక్షించారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు పరస్పర సోదరభావంతో, ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...