Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్ధన్నపేటలో BRS భారీ ధర్నా

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 2:28 PM వరంగల్General
వర్ధన్నపేటలో BRS భారీ ధర్నా - Udayam
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వర్ధన్నపేటలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ధర్నా చేపట్టాయి. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. ప్రతిపక్ష గొంతును అణచివేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆరోపించారు. అసెంబ్లీ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...