Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల మండలంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 30, 2026 8:42 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాల మండలంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు - Udayam
మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు సవరణ (SIR) కార్యక్రమాన్ని బీఆర్ఎస్ మండల నాయకులు పరిశీలించారు. పార్టీ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు ఆదేశాల మేరకు గ్రామాల్లో పర్యటించారు. బీఎల్‌వోలను కలిసి ఎన్యుమరేషన్ ఫారాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీచుపల్లి, మాలిక్, మునిస్వామి, రంగస్వామి, ప్రకాష్, పరమేష్ తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...