వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలం బ్రహ్మేశ్వర్ జలపాతంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. శ్రావణమాసం సందర్భంగా పార్డి (బి) గ్రామస్తులు రాజరాజేశ్వర విగ్రహాలను జలాభిషేకం చేసేందుకు జలపాతానికి తీసుకెళ్లారు. స్నానం చేసేందుకు నీటి గుండంలోకి దిగిన గుడాల సాయినాథ్ (55) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న ఎస్సై కృష్ణారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

