Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లారీ డ్రైవర్‌పై బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ దాడి

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 3:24 PM విశాఖపట్నంGeneral
విశాఖపట్నం షీలానగర్‌ మారుతి జంక్షన్‌ వద్ద బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ లారీ డ్రైవర్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రవాణా శాఖ తనిఖీల సమయంలో లారీ ఆపకుండా వెళ్లిపోవడంతో బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్‌ లారీని ఓవర్‌టేక్‌ చేసి దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో లారీ డ్రైవర్‌కు రక్తస్రావమైనట్లు సమాచారం. ఘటనకు నిరసనగా ఏపీ లారీ అసోసియేషన్‌ సభ్యులు ధర్నాకు సిద్ధమయ్యారు.

Comments

G
Loading comments...