వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల భద్రతకు పోలీసు శాఖ, తితిదే, విజిలెన్స్ విభాగాలు ముందస్తు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా షాపులు, హోటళ్లు, మఠాలు, అతిథి గృహాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాలను పరిశీలిస్తున్నారు.
అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఈ ధృవీకరణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సంస్థల నిర్వాహకులు పాత, కొత్త కార్మికుల పూర్తి వివరాలను సకాలంలో అందించాలని సూచించారు.
Comments
Loading comments...

