వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణ కొట్కూరు గ్రామంలో మంగళవారం కేంద్ర కరువు బృందం పర్యటించింది. జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు పంట పొలాలను పరిశీలించారు.
ఖరీఫ్ పంటల సాగు, నష్టాల వివరాలు, వర్షాభావ పరిస్థితులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ వివరాలతో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

