Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుదాఘాతంతో బాలుడి మృతి

Follow Udayam on Google
రేఖ దేవి Jul 31, 2026 12:28 PM కడపGeneral
విద్యుదాఘాతంతో బాలుడి మృతి - Udayam
పెద్దముడియం మండలం కొండసుంకేసుల గ్రామంలో పొలం వద్ద ట్రాక్టర్‌కు విద్యుత్తు తీగలు తగలడంతో గజ్జల చిన్న (16) అనే బాలుడు విద్యుదాఘాతంతో గురువారం మృతి చెందాడు. మోటారు మరమ్మతులకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. జమ్మలమడుగు ఆసుపత్రికి తరలించేసరికి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ట్రాక్టర్‌ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేయగా, బాలుడి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...