Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బోడుప్పల్‌లో బోనాల జాతర ఏర్పాట్లపై సమావేశం.

Follow Udayam on Google
Super Admin Jul 26, 2026 1:40 PM మేడ్చల్ మల్కాజిగిరి General
బోడుప్పల్‌లో బోనాల జాతర ఏర్పాట్లపై సమావేశం. - Udayam
బోడుప్పల్‌లోని బంగారు మైసమ్మ దేవాలయంలో బోనాల జాతర నిర్వహణపై ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆగస్టు 23న బోనాల జాతరను సంప్రదాయబద్ధంగా, వైభవంగా నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. జాతర ఏర్పాట్లలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భద్రత, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...