Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బొమ్మల తయారీపై శిక్షణ పూర్తి

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 6:36 PM తూర్పుగోదావరి General
బొమ్మల తయారీపై శిక్షణ పూర్తి - Udayam
రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో సెరామిక్స్, టెర్రకోట బొమ్మల తయారీపై నిర్వహించిన 30 రోజుల శిక్షణ ముగిసింది. వ్యాపార అభివృద్ధి కేంద్రం, ఆవిష్కరణ మండలి ఆధ్వర్యంలో క్రాఫ్ట్‌శాల, రెజొనెన్స్ ఇంటర్నేషనల్ సహకారంతో ఈ శిక్షణ నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామచంద్ర ఆర్.కె విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...