వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాలకు అబద్ధపు బాంబు బెదిరింపులు ఇచ్చే ఆకతాయిలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై జీవితకాల విమాన ప్రయాణ నిషేధం (లైఫ్‌టైమ్ బ్యాన్) విధించనున్నారు.
దీనితో పాటు రూ. లక్ష నుండి రూ. కోటి వరకు భారీ జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష కూడా పడనుంది. కేవలం సరదా లేదా వ్యక్తిగత కారణాలతో విమాన భద్రతకు ముప్పు కలిగిస్తున్న వారిని కట్టడి చేసేందుకు ఈ కొత్త నిబంధనలను తీసుకువస్తున్నారు.
Comments
Loading comments...

