వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మున్సిపాలిటీలోని రెండో వార్డులో టీడీపీ అభ్యర్థి ముద్దాన ఉమా మహేశ్వరి విజయం సాధించారు. ఆమెకు 777 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి కాగాన హైమావతికి 309 ఓట్లు వచ్చాయి.
మొత్తం 1,329 ఓట్లకు 1,102 ఓట్లు పోలయ్యాయి. ఉమా మహేశ్వరి 468 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. టీడీపీ విజయంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

