వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణంలోని పాతకోర్టు ఎదురుగా మురుగునీటి కాలువలో పడి తారకరామ కాలనీకి చెందిన ఎస్.లక్ష్మణ్ మృతి చెందాడు. స్థానిక బార్లో పనిచేస్తున్న లక్ష్మణ్ సోమవారం రాత్రి ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయి ఉంటారని స్థానికులు తెలిపారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

