వార్తలకు తిరిగి వెళ్లండి
కర్నూలు జిల్లా దేవరగట్టులో మాలమల్లేశ్వరస్వామి ఉత్సవ ఊరేగింపులో ఉద్రిక్తత నెలకొంది. బన్నీ జైత్రయాత్రలో భక్తులు రింగులు తొడిగిన కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఆలూరుకు చెందిన పోతురాజు (28) మృతి చెందారు.
కర్రల సమరంలో వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అల్లరి మూకలు గాల్లోకి కాగడాలు విసిరినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

