Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారం గని కూలి 67 మంది మృతి

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 6:24 PM అంతర్జాతీయంGeneral
బంగారం గని కూలి 67 మంది మృతి - Udayam
సూడాన్‌లోని పశ్చిమ కొర్దోపాన్‌ ప్రావిన్సులో బంగారు గని కుప్పకూలి 67 మంది మృతిచెందారు. నుహుద్‌ పట్టణంలోని అల్‌-జారా గనిలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పలువురి ఆచూకీ ఇంకా లభించలేదు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. స్థానికులు సాధారణ పారలు, గునపాలతో శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...