Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బకాయిలు, యూనిఫామ్ కోసం శానిటరీ వర్కర్ల నిరసన

Follow Udayam on Google
B Ganga Aug 31, 2026 4:07 PM పార్వతీపురం మన్యంGeneral
బకాయిలు, యూనిఫామ్ కోసం శానిటరీ వర్కర్ల నిరసన - Udayam
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న శానిటరీ వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్న నిరసన చేపట్టారు. తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించడంతో పాటు యూనిఫామ్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చీపురులతో నిరసన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...