Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో బీజేపీ నేతల నిరసన

Follow Udayam on Google
Harika Sep 01, 2026 11:10 AM వనపర్తిGeneral
వనపర్తిలో బీజేపీ నేతల నిరసన - Udayam
హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ కార్యాలయంపై యూత్‌ కాంగ్రెస్‌ శ్రేణుల దాడికి నిరసనగా వనపర్తిలో బీజేపీ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. రాజకీయాలను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలని, భౌతిక దాడులు సరికావని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...