వార్తలకు తిరిగి వెళ్లండి
ఉప్పల్ భగాయత్‌లో బైక్ రేసర్ల హల్‌చల్

హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ ఫేజ్-2లో బైక్ రేసర్ల ఆగడాలు శ్రుతిమించాయి. డీ-మార్ట్ సమీపంలో యువకులు ప్రమాదకర స్టంట్లు, భారీ శబ్దాలతో వాహనాలు నడుపుతూ స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నారు.
ఈ విన్యాసాల వల్ల రోడ్డు ప్రమాదాల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచి, రేసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...