వార్తలకు తిరిగి వెళ్లండి

బలహీనవర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
గత ప్రభుత్వంలో బలహీనవర్గాల టీడీపీ నేతలను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు బలహీనవర్గాల కోసం మాట్లాడటం విడ్డూరమన్నారు. వైసీపీ హయాంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని, తప్పులు చేసిన నేతలు ఇప్పుడు జైలుకు వెళ్తున్నారని అన్నారు.
Comments
Loading comments...

