వార్తలకు తిరిగి వెళ్లండి

చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా లింగాల గణపురం పోలీసులు బీఆర్‌ఎస్‌వీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండగా గండి చంద్రశేఖర్, మబ్బు కరుణాకర్‌లను అదుపులోకి తీసుకున్నారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. ముందస్తు అరెస్టులను వారు తీవ్రంగా ఖండించారు.
Comments
Loading comments...

