Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ట్రెండింగ్ 'కాక్రోచ్ జనతా పార్టీ'కి బిగ్ షాక్.. అధికారిక 'X' ఖాతా నిలిపివేత!

Sandeep Singh May 21, 2026 11:58 AM అల్ ఇండియా 13 views6 days ago
ట్రెండింగ్ 'కాక్రోచ్ జనతా పార్టీ'కి బిగ్ షాక్.. అధికారిక 'X' ఖాతా నిలిపివేత! - Udayam Digital
భారతీయ రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు (సటైర్) సంధిస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) కి గట్టి షాక్ తగిలింది. భారతదేశంలో ఈ సంస్థకు చెందిన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను నిలిపివేసినట్లు (విత్‌హెల్డ్) సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్వయంగా ప్రకటించారు. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా అధికార బీజేపీ ఫాలోవర్ల సంఖ్యను దాటేసి, మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో దూసుకుపోతున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం సంచలనంగా మారింది. నిరుద్యోగ యువత అసంతృప్తికి డిజిటల్ ప్రతీకగా మారిన ఈ అకౌంట్‌ను చట్టపరమైన కారణాలతోనే నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...