వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలో గంజాయి మత్తులో గుంపులుగా తిరుగుతున్న యువకుల ఆగడాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం ప్రాంతాల్లో కళాశాలల పరిసరాల్లోని పాన్షాపులు, టీ దుకాణాల వద్ద యువతను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి.
మత్తుకు బానిసలైన కొందరు యువకులు దాడులు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. విక్రయాలపై నిఘా పెంచాలని ప్రజలు కోరారు.
Comments
Loading comments...

