Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ వివాదంతో ఐదు కుటుంబాల కుల బహిష్కరణ

Follow Udayam on Google
Saychi kumar Aug 25, 2026 7:17 AM కామరెడ్డిGeneral
భూ వివాదంతో ఐదు కుటుంబాల కుల బహిష్కరణ - Udayam
రామారెడ్డి మండలం గోకుల్ తండాలో భూ వివాదం నేపథ్యంలో ఐదు కుటుంబాలను కుల బహిష్కరణ చేసినట్లు బాధితులు ఆరోపించారు. తమతో ఎవరైనా మాట్లాడితే రూ.50 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారని, తిరిగి కులంలో చేర్చుకునేందుకు ఒక్కో కుటుంబం రూ.లక్ష చొప్పున రూ.5 లక్షలు డిమాండ్ చేస్తున్నారన్నారు. పండుగల సందర్భంగా ఆలయానికి కూడా అనుమతించలేదని తెలిపారు. అధికారులు వెంటనే విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...