వార్తలకు తిరిగి వెళ్లండి

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చక్‌ను భారత విదేశీ కార్యదర్శి విక్రమ్ మిస్రి థింఫులో కలిశారు. ఈ సమావేశంలో భారత్-భూటాన్ అభివృద్ధి సహకార చర్చల పురోగతిని, వివిధ రంగాల సహకారాన్ని విక్రమ్ మిస్రి వివరించారు.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసేందుకు తన పూర్తి మద్దతు ఉంటుందని భూటాన్ రాజు పునరుద్ఘాటించారు. ఈ ప్రగతిని ఆయన అభినందించినట్లు భూటాన్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
Comments
Loading comments...
