Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 ఫిర్యాదులపై తక్షణ చర్యలకు ఆదేశించిన భూపాలపల్లి ఎస్పీ

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 03, 2026 6:59 PM జయ శంకర్ భూపాలపల్లి General
15 ఫిర్యాదులపై తక్షణ చర్యలకు ఆదేశించిన భూపాలపల్లి ఎస్పీ - Udayam
భూపాలపల్లి పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్‌లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ప్రజల నుంచి 15 ఫిర్యాదులు స్వీకరించారు. వినతులను పరిశీలించి సంబంధిత సీఐలు, ఎస్‌ఐలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు. చట్టబద్ధంగా ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

Comments

G
Loading comments...