వార్తలకు తిరిగి వెళ్లండి

పలిమెల మండలం లెంకలగడ్డలో తెలంగాణ క్రీడా ప్రాంగణం నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. ప్రధాన రహదారి వద్ద బోర్డు ఉన్నా మైదానం పిచ్చిమొక్కలతో నిండిపోయింది. వాలీబాల్ పోల్స్ సైతం వంగిపోయి కనిపిస్తున్నాయి.
ప్రాంగణానికి కంచె లేకపోవడంతో భూమి ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని గ్రామ యువత కోరుతోంది.
Comments
Loading comments...

