వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం మండలం పోలిపల్లి గ్రామ సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖ వైపు వెళ్తున్న మినీ వ్యాన్ రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో భోగాపురానికి చెందిన కొల్లి ఎర్రయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స కోసం సుందరపేట CHCకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

