వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 23న వేములవాడలో వినాయక నిమజ్జన వేడుకలను భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితెతో కలిసి గుడి చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
పట్టణంలో 311 గణపతి విగ్రహాలు ఏర్పాటు ఉన్నట్టు తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, భక్తులకు అవసరమైన సేవలు, క్రేన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
Comments
Loading comments...

