Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భక్తిశ్రద్ధలతో కసాపురం ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

Follow Udayam on Google
Mohammad Sep 04, 2026 12:13 PM అనంతపురంGeneral
భక్తిశ్రద్ధలతో కసాపురం ఆలయంలో వరలక్ష్మీ వ్రతం - Udayam
గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణంలో వరలక్ష్మీ వ్రతమును భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని తమ మొక్కుబడును చెల్లించుకున్నారు. వచ్చిన భక్తాదులకు ఆలయ అధికారులు అర్చకులు అమ్మవారి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.

Comments

G
Loading comments...