వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధల మధ్య జరుపుకుంటున్నారు. మండలంలోని రోటిగూడాలో ఉన్న గీత ఆశ్రమంలో ప్రధాన గురువు మౌన స్వామి ఆధ్వర్యంలో నిర్వాహకులు వినాయకునికి పూజలు నిర్వహించారు.
జన్నారం, కలమడుగు, మొర్రిగూడ, మురిమడుగు, కిష్టాపూర్, పోన్కల్, తదితర అన్ని గ్రామాలలో కూడా ప్రజలు వారి ఇళ్లల్లో వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

