వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు తన నివాసంలో సోమవారం రాత్రి భజన కార్యక్రమం నిర్వహించారు. కళాకారుల భక్తి గీతాలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
గణనాథుడు విఘ్నాలను తొలగించి ప్రజలకు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సంతోషం ప్రసాదించాలని ఎమ్మెల్యే ప్రార్థించారు. కార్యక్రమంలో మేయర్ మధుకర్, కార్పొరేటర్ తూముల నరేష్, ఏఎంసీ చైర్మన్ బానేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

