వార్తలకు తిరిగి వెళ్లండి

టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సోమవారం జామి మండలం భీమసింగి గ్రామంలో 14 సంవత్సరాలు పైబడిన ప్రజలకు ఛాతీ ఎక్సరే పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ వినీత ఆధ్వర్యంలో ఎంపీటీసీ అప్పలరాజు, మాజీ సర్పంచ్ పైడిరాజు చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభమైంది.
హైరిస్క్ గ్రామంగా గుర్తించిన నేపథ్యంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

