వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య మెడపై కత్తిపీటతో భర్త దాడి చేసిన ఘటన నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దెల వీరలక్ష్మి (30) భర్త నరసింహారావు కత్తిపీటతో దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. భర్త నరసింహారావు భార్యపై దాడి చేసి పరారైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

