Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయుల ఐక్యతకు నిదర్శనం త్రివర్ణ పతాకం:ఎమ్మెల్యే నల్లమిల్లి

Follow Udayam on Google
devendra Jul 22, 2026 1:20 PM తూర్పుగోదావరి General
భారతీయుల ఐక్యతకు నిదర్శనం త్రివర్ణ పతాకం:ఎమ్మెల్యే నల్లమిల్లి - Udayam
భారతీయుల ఐక్యతకు నిదర్శనం త్రివర్ణ పతాకం అని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. పతాక ఆమోద దినోత్సవం సందర్భంగా అనపర్తి మండలం రామవరం లో బుధవారం భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జాతీయ పతాకానికి తెలుగువాడైనా పింగళి వెంకయ్య రూపకల్పన చేయడం ఆంధ్రులకు తెలుగుజాతికి ఎనలేని గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...