వార్తలకు తిరిగి వెళ్లండి

సోంపేట ఎక్సైజ్ పరిధిలోని కంచిలి, సోంపేట, మందస మండలాల్లో వారం రోజులుగా బెల్టు దుకాణాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఎక్సైజ్ సీఐ జి.వి. రమణ తెలిపారు. దాడుల్లో నలుగురిపై కేసులు నమోదు చేసి 27 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న మరో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై సమాచారం ఉంటే 14405 / 9440902358కు తెలియజేయాలని సీఐ కోరారు.
Comments
Loading comments...

