Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెజ్జూర్‌లో పెండింగ్‌లో నిర్మాణ బిల్లు

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 10:49 AM ఆసిఫాబాద్General
బెజ్జూర్‌లో పెండింగ్‌లో నిర్మాణ బిల్లు - Udayam
బెజ్జూర్‌ గ్రామపంచాయతీ 4వ వార్డులో 64 మీటర్ల సైడ్‌డ్రైన్‌ నిర్మాణం పూర్తయి ఆరు నెలలు కావస్తున్నా బిల్లు చెల్లించలేదని కాంట్రాక్టర్‌ తెలిపారు. గాండ్ల పోషయ్య ఇంటి నుంచి సూర్ల సతీశ్‌ ఇంటి వరకు పనులను సొంత నిధులతో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. బిల్లు పెండింగ్‌లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తెలిపారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి బిల్లు చెల్లించాలని కాంట్రాక్టర్‌ కోరారు.

Comments

G
Loading comments...