వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్. విజయమ్మ గురువారం సూచించారు. తాగునీటిని కాచి లేదా శుద్ధి చేసి వినియోగించాలని తెలిపారు.
నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, దోమల వృద్ధిని అరికట్టాలని సూచించారు. కలుషిత ఆహారం తీసుకోవద్దని, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

