వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేల్ శివాలయం వెనుక కొండను భారీ యంత్రాలతో తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
తవ్వకాలకు అనుమతులు లేవని ఎంఆర్‌ఓ పేర్కొన్నట్లు సమాచారం. అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

